కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీపీఐ పార్టీ

*కాంగ్రెస్ వైపు ప్రజల ప్రవాహం

సాక్షి డిజిటల్ న్యూస్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని మరోసారి స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత పాలన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు మద్దతుగా సీపీఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సీపీఐ పార్టీ తరఫున 02వ వార్డు – ఎస్‌కే ఖాతీజ, 07వ వార్డు – బొలుగురి సుగుణమ్మ – లింగయ్య నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం నీ కలిసి కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి సహకారాన్ని తెలియజేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని ప్రజల నమ్మకం ప్రజల ఆశలు అన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయని స్పష్టం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమని కాంగ్రెస్ జెండా ఎగరడం తథ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పోకల దేవదాస్ మాధవరెడ్డి లక్ష్మీనరసింహ సిపిఐ జిల్లా నాయకులు కలీం పాషా నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *