సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం ఫిబ్రవరి 3: రావికమతం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ పైల రాజు అధ్యక్షతన మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్తరాంధ్ర కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న కళ్యాణ ప్రవచనాలు ను ఈ ఏడాది పార్టీలకతీతంగా నాయకులు ప్రజాప్రతితులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది నుంచి బస్సులు ఇతర వాహనాలు నేరుగా ఆలయం వద్దకు రిజర్వాయర్ వద్దకు చేరుకునేలా ప్రత్యేక రహదారి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే 28 పంచాయతీల నుంచి 28 ఉచిత భోజన కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన ప్రాంత తిరునాళ్లను మనమంతా విజయవంతం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు పాల్గొని సమస్యలపై ధ్వజమెత్తారు. రైతుల నుంచి ఈ ఏడాది చేసిన ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయని రావికమతం ఎంపీటీసీ (సూపర్) వే పాడ నాగేశ్వరరావు , బంటు సన్యాసినాయుడు ఆగ్రం వ్యక్తం చేశారు. దిబ్బిడి రైస్ మిల్ కి తీసుకెళ్లిన ధాన్యానికి లెస్ తో పాటు క్వింటాకు 1500 ఇస్తేనే కొనుగోలు చేస్తామని, లేకుంటే వెనక్కి తీసుకెళ్లి పోవాలని మిల్లర్లు బెదిరించడంతో ఇచ్చు కోక తప్పడం లేదని, రైతులకు అన్యాయం జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. అలాగే యూరియాను ప్రైవేటు వ్యాపారులు బస్తా 450కు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోలేదని కొమిర సర్పంచ్ గొర్లె రవికుమార్ ఆరోపించారు. కొత్తకోట పీహెచ్సీలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందక ఉపాధ్యాయుడు మృతి చెందారని, దీనికి వైద్య సిబ్బంది బాధ్యత వహించాలని కొత్తకోట ఎంపీటీసీ పూడి దేవా దుయ్యబట్టాడు. అలాగే కుక్కకాటు గురైన విద్యార్థులు ఆసుపత్రికి వెళ్లినా వైద్య సిబ్బంది పట్టించుకోలేదని ద్వజ మెత్తారు. ఆసుపత్రిలో ఫార్మసిస్టు రోగులపై దుర్భాషలాడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేష్ వైస్ ఎంపీపీ భవాని ప్రసాద్, టిడిపి మండల శాఖ అధ్యక్షుడు కోమటి శంకర్రావు పలువురు పాల్గొన్నారు . శేషు రావికమతం.
