ఒక్క అవకాశం ఇవ్వండి.అభివృద్ధి నా బాధ్యత

*7వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తోట్ల రామకృష్ణ.

అందోల్ ఫిబ్రవరి 4 (సాక్షి డిజిటల్ న్యూస్ ) అందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి తోట్ల రామకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి గడపను సందర్శిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 7వ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంచరీ శ్రీనివాస్, ప్రభు , బబ్లు, ప్రభాకర్, పాండు, జావేద్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *