సాక్షి డిజిటల్ న్యూస్, 03 ఫిబ్రవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్ : కేంద్రం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుగులేని అభివృద్ధి చూపిస్తున్న విధంగా 13వ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ అభ్యర్థి ఆగండ్ల గట్టయ్య ప్రజలను కోరారు. 13వ వార్డులో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకు న్నానని, అవన్నీ అమలు చేయాలంటే పదవి తప్పనిసరి కాబట్టి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. పదవి మీద వ్యామోహం లేదు, డబ్బుమీద ఆశ లేదు, పొగరు లేదు, కోపం అంతకన్నలేదు, వున్నదల్లా సమాజంలో ఉన్న సమస్యలను చూస్తూ వుండలేక పోవడం. సాధారణ వ్యక్తిగా ఒక్క సమస్య తీర్చలేని పరిస్థితి. అందుకే మీలో ఒకడిగా, ఒక అన్న, తమ్ముడు, ముఖ్యంగా మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను ఆదరించి, ఆశీర్వదించి ఒక్కసారి పదవి కట్టబెట్టి చూడండి అని 13వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆగండ్ల గట్టయ్య తన మనసులో మాట ప్రజలముందు వెల్లడించి ఓట్లు అభ్యర్థించారు.