ఐఎన్టియుసి క్యాలెండర్ ఆవిష్కరించిన యూనిట్ హెడ్ శైలందర్ సింగ్

పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 04, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి పిఎస్పిడి భద్రాచలం పేపర్ బోర్డు కర్మాగారంలో ఐఎన్టియుసి నూతన క్యాలెండర్ 2026 ను యూనిట్ హెడ్ శైలందర్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాలు వల్ల ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆలస్యమైందని. గత 20 సంవత్సరాలుగా యాజమాన్యం సౌజన్యంతో ఐఎన్టియుసి మిత్రపక్షాలు కలిసి క్యాలెండర్ ముద్రించి కార్మికులకు అందజేయడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం 2026 లో కూడా కార్మిక సోదరులందరూ భద్రత పాటిస్తూ కంపెనీ ముందుకు సాగాలని , ఈ 2026 సంవత్సరంలోనైనా ఎనిమిదో ప్లాంటు మన భద్రాచలం కు వచ్చే విధంగా మన యూనిట్ హెడ్ శైలేందర్ సింగ్ కార్పొరేట్ స్థాయిలో మాట్లాడాలని కోరుకుంటున్నాను అన్నారు . ఈ సంవత్సరం మన కంపెనీ మరింత అభివృద్ధి చేద్దాలని అదేవిధంగా జరగబోయే 14 వేతనం ఒప్పందం కూడా కార్మికులందరికి ఆమోద్యయోగంగా ఉండేవిధంగా చూడాలన్నారు . ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ హెడ్ శ్యామ్ కిరణ్ , జిఎం రాంబాబు, భాస్కర్ , ఐఎన్టియుసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొనె రామారావు, యారం పిచ్చిరెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ మరియు ఐఎన్టియుసి కార్మిక నాయకులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మిక నాయకులు వీరన్న, సాంబిరెడ్డి, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *