సాక్షి డిజిటల్ న్యూస్ రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ను రద్దు చేసి, 29 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని ఈనెల 12న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఆశా కార్యకర్తలందరూ పాల్గొననున్నామని మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రుద్రూర్ పీహెచ్ సీలో మెడికల్ ఆఫీసర్ ఆయేషా సిద్దిఖా కు ఆశా కార్యకర్తలు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ మండల కార్యదర్శి వాణి, యూనియన్ నాయకులు ప్రవళిక, ప్రేమల, గంగామణి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.