అందోల్ ఫిబ్రవరి 3 (సాక్షి డిజిటల్ న్యూస్) అందోల్ జోగిపేట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ బీ–ఫారమ్‌లను ఆయన మున్సిపాలిటీలో పోటీచేయన్నున్న అభ్యర్థులకు బి ఫారమ్ అందజేశారు. ఈ సందర్భంగా అందోల్ నియోజకవర్గ పరిధిలోని అందోల్ జోగిపేట మున్సిపాలిటీకి చెందిన 20 వార్డులు, అందరు అందోల్ జోగిపేట మున్సిపాలిటీకి చెందిన 20వార్డుల అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ బీ–ఫారమ్‌లు అందజేశారు. సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను ఆయా పార్టీ ఇంచార్జ్‌లకు అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో పట్లూరి శివశేఖర్, రామా గౌడ్, చాపల వెంకటేశం, వినోద్ రెడ్డి, మల్కాల బలరాం, నాగరత్నం గౌడ్, రొయ్యల సత్యం, డిబి నాగభూషణం, మున్సిపాలిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.