అంగన్వాడి సెంటర్‌లో నూతన సర్పంచ్ కు సన్మానం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 భూమయ్య పిట్లం . . పిట్లం మండల కేంద్రంలోని బోయవాడ గ్రామ అంగన్వాడి సెంటర్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డ్ మెంబర్లకు అంగన్వాడి ఉపాధ్యాయురాలు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చేతుల మీదుగా తల్లులకు బాలామృతం, గుడ్లు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్‌కు వచ్చే ప్రతి చిన్నారి, బాలింతలు, గర్భిణీలు తప్పనిసరిగా సెంటర్‌కు వచ్చి గుడ్లు, భోజనం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల అభివృద్ధికి ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. మంత్రి సీతక్క అంగన్వాడి సెంటర్లకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందు కు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
అంగన్వాడి సెంటర్లను సక్రమంగా నిర్వహిస్తే పిల్లలు, తల్లులు, గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు గాండ్ల లింగం, రాజు, హనుమాన్లు, ఎనిగే రాజు, బాలకృష్ణ, మోతిలాల్ పాల్గొన్నారు. అలాగే అంగన్వాడి సెంటర్ ఉపాధ్యాయురాళ్లు జయంతి, రాధా, సుమలత, ప్రవీణ, విజయలక్ష్మి, శోభ, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *