సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్ గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో హైవే నుండి గాంధి బొమ్మ మీదగా ఆటోనగర్ సెంటర్ వరకు ఇరువైపల ఫుట్ పాత్ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాధం జగన్ పాల్గొని ఈ సందర్బంగా ముఖ్య అతిదులు మాట్లాడుతూ నేషనల్ హైవే నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు ఇరువైపులా ఫుట్ పాత్ పనులు చేయుట కొరకు జీవీఎంసీ నిధులు సుమారు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నామని. వాటిలో భాగంగా వడ్లపూడి నుండి పనులు ప్రారంభమయ్యాయని, పనులు పట్ల నాణ్యత తగ్గకుండా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సెక్రెటరీ బొట్టా ప్రకాష్ రాజన్ రాజు, కళ్లేపల్లి శ్రీనివాసవర్మ, గండేపల్లి రాము, ఈర్ల దేముడు,రాజు, బోండా నాగరాజు, వర్క్ ఇన్స్పెక్టర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.