సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 2 2026 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్, అనంతగిరి మండలం వాయిలసింగవరం గ్రామంలో ఈరోజున గ్రామ పంచాయితీ కార్యాలయం నందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 20వఆవిర్భావ దినోత్సవంవేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అనంతగిరి మండల ఉపాధి హామీ పధకం ఏపీవో నూకబత్తిని వెంకన్న పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు కేక్ కట్ చేయడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ 2006 నఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని బండ్లమూడి గ్రామంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పనిదినాలను 125 రోజులు పనిదినాలు పెంచడం జరిగిందని అన్నారు. మరియు ఈ పధకానికి ఇప్పటిదాకా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పేరును అలాగే కొనసాగించాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి సౌమ్య, మేట్లు కొల్లు సుబ్బారావు,గడ్డం వీరబాబు, బుర్రా వీరబాబు, గరిడేపల్లి కనకయ్య, బుర్రా ఉమ, బుర్రా చిలకమ్మ, బాదరబోయిన నాగేంద్ర,ఉపాధి హామీ పథకం కూలీలు గ్రామ పంచాయితీ సిబ్బంది విజయ్ తదితరులు పాల్గొన్నారు