సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పొనకల్ లో గల ఊర చెరువు గత 80 సంవత్సరాల క్రితం 47 ఎకరాల విస్తీర్ణంతో లోతైన చెరువు ఉండేదని ట్యాంక్ లెవెల్ ఫుల్ కరకట్ట బఫర్ ఏరియా సిల్క్ వే తో పాటు విశాలమైన కరకట్ట ఉండి సుమారు 12 ఎకరాల చెరువు విస్తీర్ణంతో నిండుకుండ లాగా చెరువును తలపిస్తూ రైతంగానికి గంగపుత్ర కుటుంబాలకు ఉపాధి నిచ్చే విధంగా పేరుగాంచిన చెరువుగా నిలిచింది. ప్రస్తుతం 12 ఎకరాల విస్తీర్ణం కంటే తక్కువగా ఉన్నట్టుగా సుమారు కంటినధర్లు కనబడుతుంది చర్యలు తీసుకోవాలని స్థానిక గంగపుత్ర సోదరులు సామాజికవేత్తలు పర్యావరణ అభిమానులు అధికారులు చర్యలు తీసుకొని బౌండరీలు ఏర్పాటు చేయాలని కోరారు పలుసార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ కబ్జాల పర్వం ముమ్మాటికి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదని యువత అన్నారు నీటి కొరత మత్స్య సంపద తగ్గుముఖం పట్టి చెరువు నామరూపాలు లేకుండా పోతుంది అనే విధంగా ప్రస్తుత పరిస్థితిలో పొనకల్ ఊర చెరువు దృశ్యములు ఉన్నాయి.