జమ్మికుంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం ఘనంగా నిర్వహణ

సాక్షి డిజిటల్ న్యూస్ 2-2-2026 జనవరి జమ్మికుంట టౌన్ రిపోర్టర్, జమ్మికుంట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం (2-2-2026) శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ పుష్కరిణిలో శ్రీ వెంకటేశ్వర స్వామి చక్రస్నానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.చక్రస్నానం అనంతరం భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *