కాటా చేతికి పవర్ మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల నిర్దేశం

*మారుతున్న రాజకీయ ముఖచిత్రం బి ఆర్ ఎస్ బి ఫామ్ లు ఎవరి చేతిలో

సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి అరుణ.. పటాన్చెరు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ అనిస్థితికి తెరపడింది. మునిసిపల్ ఎలక్షన్లలో ఇరు వర్గాలు స్పష్టమైన సాంకేతాలతో ఉత్సాహంతో పనిచేస్తున్నారు పటాన్చెరులోని ఐదు పురాపాలికల్లో టిఆర్ఎస్ బీఫాంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్ రెడ్డి సంయుక్తంగా నిర్ణయించిన అభ్యర్థులకే ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు సూచనల మేరకు ఐదు పురాపాలికల్లో ఐదుగురు సభ్యులను నియమించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు అప్పగించారు. పార్టీ పరంగా నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్ రెడ్డి బిఫారాలపై సంతకాలు పెట్టి అందజేయ నున్నారు అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిన తర్వాత నాలుగో తేదీ నుంచి పొరపాలికల్లో ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయ్ అంటూ సమాచారం సోదరుడు మధుసూదన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో అన్నతో కలిసి ప్రచారం చేయనున్నారని తెలిసింది. అయితే బాధ్యతలు విషయంలో ఇద్దరు మంత్రులు కలిసి కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఉంచినట్లు తెలిసింది ఇదే విషయం మాట్లాడడానికి వేం నరేంద్ర రెడ్డి ఫోన్ చేస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ లిఫ్ట్ చేయలేదని దీంతో ఆయన జిల్లా మంత్రి దామోదర్ రాజన్న నరసింహను సంప్రదించి కాటుతో మాట్లాడించినట్లు తెలిసింది. మంత్రులను కార్యాలయానికి పిలిపించుకొని ఎన్ని రోజులు జరిగింది మరిచిపోయి ఇకపై పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు న్యాయం జరిగేలా అధికార వికేంద్రీకరణ చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నామని చెప్పినట్లు సమాచారం ఇప్పటికే ఐదు పురపాలికల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అన్ని వార్డులో నామినేషన్లు వేసిన రెబెల్స్ ను రామచంద్రపురం లోని కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసంలో తెల్లవారు జామున మూడు గంటల వరకు రెబల్స్ తో మాట్లాడుతూ నియోజకవర్గం లోని అన్ని వర్గాలను కలుపుకుంటూ అభ్యర్థులను సర్దుబాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *