ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి :సర్పంచ్ మచ్కూరి రమేష్

సాక్షి డిజిటల్ న్యూస్ 3 ఫిబ్రవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా, ఇండ్లు కట్టుకోలేని స్తోమత లేని గ్రామీణ పేదల కోసం ప్రభుత్వం చేపడుతున్న బృహత్ పథకం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అని చిక్కడపల్లి సర్పంచ్ మచ్కూరి రమేష్ అన్నారు.చిక్కడపల్లి లో అబేదా బి ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి భూమి పూజ చేసి ఇంటి నిర్మాణాపనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలైన లబ్ధిదారులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తుందని, వెంటనే నిర్మాణాలు ప్రారంభించి తొందరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులందరూ సకాలంలో నిర్మాణపు పనులు చేపట్టి ఇళ్ల ను నిర్మించుకునేందుకు తోడ్పాటు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అవార్డు మెంబర్ జెల్ల సాయిలు, పంచాయతీ కార్యదర్శి మోహన్, కారోబార్ అశోక్,మచ్కూరి రాము, మేతరీ నవీన్, మోహన్, బేగరి గంగాధర్, మహబూబ్, లాల్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *