APPSC గ్రూప్–2 ఫలితాలలో మిన్నయ్యగారి పల్లి యువకుడికి ఎక్సైజ్ ఎస్‌ఐ ఉద్యోగం

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి :29( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, మిన్నయ్యగారిపల్లి గ్రామానికి చెందిన గంగవరం వెంకట రెడ్డి–గంగవరం లక్ష్మీదేవి దంపతుల పెద్ద కుమారుడు గంగవరం దినేష్ కుమార్ రెడ్డిAPPSC విడుదల చేసిన గ్రూప్–2 తుది ఫలితాలలో ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా (హాల్ టికెట్ నెం. 112214798) ఎంపికయ్యారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్న తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా దినేష్ కుమార్ రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం గ్రామస్థుల్లో ఆనందోత్సాహాలను నింపింది. ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న దినేష్ కుమార్ రెడ్డి పదవ తరగతి వరకు వేంపల్లి చైతన్య హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి, అనంతరం తంజావూరు లోని శాస్త్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. గ్రామీణ నేపథ్యంనుంచి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన దినేష్ కుమార్ రెడ్డి విజయం, గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. పలువురు ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.