30న 6 గ్రామాలకు విద్యుత్ అంతరాయం

సాక్షి డిజిటల్ న్యూస్ 29 జనవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, ఈనెల 30న 6 గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని మండల విద్యుత్ శాఖ అధికారి కర్రీ శంకర్రావు తెలిపారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు విద్యుత్ సబ్స్టేషన్ పనుల్లో భాగంగా సబ్స్టేషన్ పరిధిలోని బోయిల కింతాడ కొత్త పెంట ములకలాపల్లి వేచలం గవరవరం జగన్నాధపురం గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఆయన తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ నిలిపి వేయడం జరుగుతుందన్నారు మండలంలోని విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా ఆయన కోరారు.