2047 విజన్ యాక్షన్ ప్లాన్ తో తంబళ్లపల్లె అభివృద్ధి.

★విజన్ డిడిఓ.పీడీ వెంకటరత్నం.

సాక్షి డిజిటల్ న్యూస్ :29 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధిలో భాగంగా 2047 విజన్ యాక్షన్ ప్లాన్ టీం మెంబర్లు తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని 20 47 విజన్ యాక్షన్ ప్లాన్ డిడిఓ పీ.డి వెంకటరత్నం సూచించారు. బుధవారం పాత ఎస్టి బాలికల స్వగృహంలో 2047 విజన్ కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 2047 విజన్ యాక్షన్ ప్లాన్ విధి విధానాలను, అధికారుల సమన్వయంతో తంబళ్లపల్లె నియోజకవర్గం అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించాలని తెలిపారు. ఆయన వెంట సిపిఓ వెంకట పెద్దయ్య, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఏపి ఓ అంజనప్ప, 20 47 టీం మెంబర్లు పాల్గొన్నారు.