సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి.29: వేములవాడ. టౌన్ రిపోర్టర్: అక్కనపల్లి పరుశురాం… భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయిన, పంజాబ్ సింహం గా ప్రసిద్ధి చెందిన లాలా లజపతిరాయ్ 161 వ, జయంతి సందర్భంగా వేములవాడలోని ప్రాథమిక పాఠశాల న్యూ అర్బన్ కాలనీలో లాలాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ "లాలాజీ భారతదేశ పంజాబ్ రాష్ట్రంలోని మోఘా జిల్లా ధుడికే గ్రామంలో జనవరి 28, 1865న జన్మించాడని, నవంబర్ 17, 1928న తుది శ్వాస విడిచాడని, లాలాజీ తన నిర్భయ నాయకత్వం మరియు భారతదేశ స్వాతంత్ర్య పోరాటం పట్ల అచంచలమైన అంకితభావం కారణంగా ప్రతిష్టాత్మకమైన పంజాబ్ కేసరి (పంజాబ్ సింహం ) బిరుదు పొందాడని, లాలాజీ పంజాబ్ నేషనల్ బ్యాంక్, లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు అని, అతివాద నాయకులు లాల్- బాల్ -పాల్ త్రయంలో ఒకటిగా ప్రసిద్ధి చెందాడని, 1928 లో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ విచారణ సంఘం (సైమన్ కమిషన్) ను వ్యతిరేకిస్తూ లాలా లజపతిరాయ్ చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాలా ప్రముఖమైందని, 1920 - 30 దశాబ్దంలో జాతీయ కాంగ్రెస్ వారి మెత్తదనపు మితవాద సిద్ధాంతమును విడనాడిన తీవ్రవాద జాతీయవాదులలో లాలాజీ ప్రముఖుడని, 1920 కలకత్తా ప్రత్యేక సమావేశంలో లాలాజీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, 1921లో ఆయన సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ అనే లాభాపేక్ష లేని సంక్షేమ సంస్థను స్థాపించారని, హిందూ సమాజం కుల వ్యవస్థ, మహిళల స్థానం మరియు అంటరానితనంపై స్వయంగా పోరాడాలని ఆయన అభిప్రాయ పడ్డారని, 1928 లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా లాలాజీ సైమన్ గో బ్యాక్ నినాదం ప్రసిద్ధి చెందిందని, ఆయన మరాఠీలో 'స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను' అనే నినాదం కూడా ప్రసిద్ధి చెందిందని, నేను మరణించవచ్చు కానీ నా నుండి వెలువడే ప్రతి నెత్తురు చుక్క నుండి లక్షలాది స్వాతంత్ర్య సమరయోధులు ఉద్బవిస్తారని ప్రకటించిన లాలాజీ మాట నిజమైందని, సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో లాఠీ దెబ్బలతో కన్ను మూసే సమయంలో లాలాజీ 'ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయని' చెప్పాడని, లాలాజీ భారతీయ పత్రికలను శాసించే అధికారం నాకుంటే పసివాళ్ళకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య ఈ మూడు శీర్షికలను మొదటి పేజీలో ఉండాలని చెబుతానన్నాడని, లాలాజీ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని" పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్శేటి లక్ష్మీనారాయణ, దాసరి సుజాత, అంగన్వాడి ఉపాధ్యాయురాలు లిక్కిడి మంజుల మరియు విద్యార్థులు పాల్గొన్నారు.