సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 29 – సికింద్రాబాద్ – సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించిన ఘనత తమదే నని , ప్రజలు నిరంతరం తమకు బ్రహ్మరధం పడుతున్నారని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. మెట్టుగూడ డివిజన్ లో పద్మారావు గౌడ్ బుధవారం విస్తృతంగా పర్యటించి రు.86 లక్షల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులను ప్రారంభించారు. చింతాబావి, దాదర్ కాంపౌండ్, మెట్టుగూడ, మైలారగడ్డ ప్రాంతాల్లో సీ సీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ నేతలు, శ్రేణుల సహకారంతో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కంచు కోటగా మార్చుకున్నామని, ప్రజల సమస్యలకు వెనువెంటనే స్పందిస్తామని తెలిపారు. ప్రజలు తమ అవసరాలకు సీతాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. కార్పొరేటర్ రాసురి సునీత మాట్లాడుతూ ఏం. ఎల్. ఏ. పద్మారావు గౌడ్ సహకారంతో మెట్టుగూడ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. కార్పొరేటర్ సామాల హేమ, అధికారులు సరిత, హేమూ నాయక్, యువ నేత రామేశ్వర గౌడ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.