సర్వేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

సాక్షి డిజిటల్ న్యూస్:జనవరి 29 ఆత్మకూర్ (ఎం) మండల రిపోర్టర్ మేడి స్వామి, ఆత్మకూరు మండలం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విస్తృత పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా సర్వేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను ప్రారంభించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.అనంతరం మహిళల సాధికారతకు తోడ్పడేలా మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మహిళలు స్వయం ఆధారంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి ఉప సర్పంచ్ వార్డు సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.