శ్రీశైలం శాశ్వత అన్నదాన పథకాన్ని జి.దయానంద్ బెంగళూరు వారు లక్ష విరాళం

★దాతకు బాండును అందజేసిన డొనేషన్ సూపర్డెంట్ కె.అయ్యన్న

సాక్షి డిజిటల్ న్యూస్:జనవరి 29, నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలం రిపోర్ట్ కోటి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భక్తుల సౌకర్యార్థం అన్నపూర్ణ భవనం నందు ప్రతిరోజు నిర్వహించే అన్న ప్రసాద వితరణ గాను జి.దయానంద్, బెంగుళూరు,కర్ణాటక రాష్ట్రం వారు బుధవారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ.1,00,016/-లను అందజేశారు.ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేయడం జరిగింది. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి. అనంతరం దాత శ్రీ స్వామి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది.