వైరాలో లో ఎన్నికల కోలాహ లం…. టిఆర్ఎస్ అభ్యర్థి తొలి నామినేషన్

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా జనవరి 29/2026 ఖమ్మం జిల్లా వైరా చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు, జరగనున్న మున్సిపల్ ఎన్నికలల నోటిఫికేషన్ విడుదల కావడంతో వైరాలో రాజకీయ సందడి మొదలైంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం బి.ఆర్.ఎస్ పార్టీ తరఫున రెండో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతి శివకుమారి నామినేషన్ దాఖలు వేశారు. మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆమె పత్రాలను సమర్పించారు. వైరా మున్సిపాలిటీలో తొలి నామినేషన్ టిఆర్ఎస్ పార్టీ నామినేషన్ వేయడంతో అక్కడ రాజకీయ పార్టీ వేడి మొదలైంది. అక్కడున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. వైరా మున్సిపాలిటీలో నమోదైన ఇదే తొలి నామినేషన్ ఇదే కావడం విశేషం.