సాక్షి డిజిటల్ న్యూస్: 29 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన మానవ వన్యప్రాణి సంఘర్షణ సదస్సులో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణాగౌడ్ మాట్లాడుతూ, వన్యప్రాణులను వేటాడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ జంతువులను వేటాడటం, గాయపరచడం వంటి చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, వన్యప్రాణి సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అవగాహన కల్పించాలని తెలిపారు.