వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని ముస్లింలు డిమాండ్…..

★వక్ఫ్ బోర్డు ఆదాయానికి భారీ గండి.. ★బోడుప్పల్ కుతుబ్షాహీ అలంగీర్ మస్జీద్ కమిటీపై తీవ్ర ఆరోపణలు..

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ బోడుప్పల్‌లోని సర్వే నెం.150 యందు గల మస్జీద్ ఈ కుతుబ్షాహీ అలంగీర్ ‌కు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని దుర్విని యోగం చేస్తున్నారంటూ మస్జీద్ కమిటీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మస్జీద్ కమిటీ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ (TSRTC అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్) మరియు కోశాధికారి మహమ్మద్ అసిఫ్ అలీ (సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగి) వక్ఫ్ బోర్డు నిధులను తమ వ్యక్తిగత అవసరాలకు మళ్లించారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. కమిటీ ఏర్పడిన సంవత్సరం నుండి మస్జీద్‌కు వచ్చే చందాలు, డొనేషన్లు మస్జీద్ ఖాతాలో కాకుండా కమిటీ సభ్యుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారు పది నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు నిధులు దారి మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయమై ముస్లింలు ప్రశ్నించగా, కమిటీ సభ్యులు సరైన వివరాలు వెల్లడించకుండా,దొంకాతిరుగుడు సమాధానాలు చెబుతూ ప్రశ్నలు అడిగిన ముస్లింలు భయభ్రాంతులకు గురిచేస్తూ వివరాలు కావాలంటే లేటర్ రాసి పాన్ కార్డు, ఆధార్ కార్డు సమర్పించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా, మస్జీద్ ముందు ప్రాంతంలో వక్ఫ్ బోర్డు లేదా మున్సిపల్ అనుమతులు లేకుండానే అనేక దుకాణాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఆ దుకాణాల నుంచి వసూలు చేస్తున్న అద్దెను ఫోన్‌పే, గూగుల్‌పే వంటి ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా నేరుగా ప్రెసిడెంట్, కోశాధికారి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దె ఆలస్యంగా చెల్లిస్తే దుకాణదారులను బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు.