సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 29 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం.. రోడ్డుపై వాహన ప్రయాణం చేసే అప్పుడు ట్రాఫిక్ నియమనిబంధనలతో పాటు, సురక్షిత నియమ నిబంధనలు కూడా పాటించాలని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు పోలీస్ సిబ్బందితోపాటు, వాహనదారులు పాల్గొన్నారు.