రోడ్డుకు మరమ్మత్తు పనులు చేయించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ 29 జనవరి : వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి : మండలం పరిధిలోని అర్రూరు గ్రామ పంచాయతీ అర్రూరు నుండి జంగారెడ్డిపల్లి దుర్గమ్మ గుడి వరకు ఉన్న మట్టి రోడ్డులో ఉన్న కంప చెట్లను బుధవారం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి తన సొంత నిధులతో జెసిపి మరియు డోజర్ తో మరమ్మత్తు పనులు చేయించారు. రోడ్డు ప్రక్కన గుంపుగా ఉన్న చెట్లపొదలను తొలగించినందుకు రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.