రైతుల పొలాల వద్ద విద్యుత్ వైరు దొంగతనం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్, బొల్లెం చేరువు గ్రామాలలో మూడు వ్యవసాయ బోరు మోటార్లకున్న వైర్లు చోరీకి గురయ్యాయి. గ్రామానికి చెందిన పసెడ్ల ధర్మపురి, గుండు ఆనంద్, ఐలవేణి ధరి పొలం వద్ద బోరు మోటార్ల ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విద్యుత్‌ వైర్లను మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు అపహరించారు. దాంతో బాధిత రైతులు ఆందోళన చెందారు. రాత్రివేళ దొంగల భయంతో పొలానికి వెళ్లాలంటేనే భయమే స్తోందని ప్రజలు తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్తుడు కనకట్ల అనిల్ అనే రైతు మాట్లాడుతూ… కొండాపూర్, బొల్లెం చేరువు గ్రామాలలో తక్షణమే సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీస్ వారిని కోరుతూ, తరుచు పెట్రోలింగ్ చేయాలని విన్నవించాడు.