సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్ ఈరోజు తన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ప్రస్తుత స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి నుంచి మండల, డివిజన్ స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ఇరు నేతలు ప్రస్తావించారు. యువత, మహిళలు, వెనుకబడిన వర్గాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కంచి మహేందర్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధే బీజేపీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, ఎన్నికల సన్నాహాల్లో ఇది కీలకంగా మారిందని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.