రాజంపేట టిడిపి కార్యనిర్వహకులకు శిక్షణ కార్యక్రమం

*మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నారా లోకేష్ సమక్షంలో

సాక్షి డిజిటల్ న్యూస్ :29 జనవరి 2026 తంబాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ( రాము) మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట కార్యదర్శులకు వారం పాటు జరిగే శిక్షణా కార్యక్రమానికి హాజరైన ములకలచెరువు మండలం నుండి రాజంపేట కార్యనిర్వాహక కార్యదర్శి ఎం గంగాదేవి , ఉప అధ్యక్షురాలు రాధా, మదనపల్లి అధికారప్రతినిధి విజయమ్మ, తంబళ్లపల్లి అధికార ప్రతినిధి మౌలాలి, తంబళ్లపల్లి ఉపాధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లడం , ప్రజల సమస్యలను గుర్తించి వారి సమస్యను పరిష్కరించే విధంగా తోడ్పడడం, గ్రామాల అభివృద్ధి పథంలో నడిపించడం లాంటి శిక్షణ కార్యక్రమానికి అర్హులు అయినందుకు, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *