మొదలైన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ.

★నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కొత్తగూడెం కమిషనర్ సుజాత.

సాక్షి డిజిటల్ న్యూస్: 29 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్/కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, అధికారులు నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిం చారు. కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో 29, పాల్వంచ డివిజన్ కార్యాలయంలో 27, సుజాత నగర్ డివిజన్‌లో 4 డివిజన్ల కోసం ప్రత్యేక కేంద్రాల ద్వారా బుధవారం నామినేషన్లు స్వీకరించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పాల్వంచలోని మున్సిపల్ డివిజన్ కార్యాలయంలో బుధవారం 27 డివిజన్లకు సంబంధించిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో పార్టీల నాయకులతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత నామినేషన్ స్వీకరణ విధానాన్ని పరిశీలించి, ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.