సాక్షి డిజిటల్ న్యూస్ 29 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో కోరుట్ల, రాయికల్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను, పలు పోలింగ్ కేంద్రాల ను అదనపు ఎస్పి అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ గారు పరిశీలించారు.అక్కడ కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియ, నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధి నిబంధనలను అమలు చేయాలని నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా వ్యక్తులను పంపవద్దని అన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అన్నారు. అదనపు ఎస్పీ వెంట డిఎస్పి రాములు, కోరుట్ల సీ.ఐ సురేష్ ,మరియు ఎస్.ఐ లు చిరంజీవి, సుధీర్ రావు ఉన్నారు.
