సాక్షి డిజిటల్ న్యూస్ వర్ధన్నపేట . రిపోర్టర్ కుందూరు మహేందర్ రెడ్డి .వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన వారు, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు కృషి చేయాలన్నారు.