మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

సాక్షి డిజిటల్ న్యూస్:జనవరి 29 ఆత్మకూర్(ఎం) మండల రిపోర్టర్ మేడి స్వామి, ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పోతిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ ఉప సర్పంచ్ మెట్టు లలిత వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎడమ మోహన్ రెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అధికారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.