భారత రాష్ట్ర సమితి పార్టీ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

సాక్షి డిజిటల్ న్యూస్ 29 జనవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ ఫంక్షన్ హాల్ నందు భారత రాష్ట్ర సమితి పార్టీ 2026 నూతన సంవత్సర డైరీ ని క్యాలెండర్ ను భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రుద్రూర్ మండల పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా, కట్టుబాటుతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి, బీఆర్‌ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త తన వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ గాండ్ల మధు, డౌర్ సాయిలు, బొట్టే గజేందర్, సిరిగాది శేఖర్, కొత్తపల్లి రవి కిరణ్, అల్లావుద్దీన్, శానం పోశెట్టి, ఆర్ పోచయ్య, కర్రోళ్ల వెంకటేష్, సాయికిరణ్, పార్వతి ప్రవీణ్, సంకిరి వీరయ్య, నీరడి సాయిలు, చాంద్ పాషా పాల్గొన్నారు.