సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బుధవారం ఒక ప్రేమ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పదర మండలం చిట్లనుకుంట గ్రామానికి చెందిన సువర్ణ బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు ఈమధ్య వీరి ప్రేమ వివాహం కుటుంబ సభ్యులకు తెలవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు దీంతో మనస్థాపానికి గురైన వీరిద్దరూ బొమ్మనపల్లిలోని ఒక ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు గత మూడు రోజులుగా ఇదే ఇంటిలో మీరు నివాసం ఉన్నట్టు సమాచారం తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవడం లేదు ఇక కలిసి బ్రతకలేవెమో విడిపోయి బాధపడే కంటే కలిసి మరణించడం మంచిదనే భావనతో ఆత్మహత్యకు పూనుకున్నారని అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించామని సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిద్దాపూర్ ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.