సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 29 మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో సింగరేణి బీసీ ఎంప్లాయిస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ, బీ సి అసోసియేషన్ ద్వారా బీసీ ఉద్యోగుల హక్కుల కోసం మరియు అభివృద్ధికి కృషి చేస్తూ అదే విధంగా సింగరేణి ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటూ సింగరేణి అభివృద్ధికి మరియు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. బీసీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఏరియా జిఎం బిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసం బీసీ అసోసియేషన్ కి సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యస్ ఓ టూ జిమ్, శ్రీనివాసాచారి , డీజీమ్ పర్సనల్ సలగల రమేష్ , కేంద్ర కమిటీ సభ్యులు మరియు ఏరియా కమిటీ సభ్యులు మరియు అన్ని గనులు డిపార్ట్మెంట్ నుంచి బీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.