సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా, రామ కుప్పం మండలం బిజెపి కార్యకర్తల సమావేశం మండల బిజెపి అధ్యక్షులు రాణి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సమీపంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనతా వారిది కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త జయప్రదం చేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా గ్రామాల్లో పర్యటన చేసి ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా చూడాల్సిన బాధ్యత బిజెపి పార్టీ కార్యవర్గం కార్యకర్తలపై ఉన్నదన్నారు ఈ సందర్భంగా బిజెపి కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు జగదీష్ నాయుడు ఆదేశాల మేరకు మండల బిజెపి పార్టీ అధ్యక్షులు రాణి జనార్ధన్ ప్రకటించారు మండల ప్రధాన కార్యదర్శులుగా బి, నాగరాజు, నరేంద్ర కుమార్, కార్యదర్శులుగా 6 మంది రవి రఘునాథరావు మహేష్ పద్మనాభం ప్రశాంత్ మురళి ఉపాధ్యక్షులుగా తులసీనాథ్ శంకర్ నారాయణ భాస్కర్ రఘునాథ్ ఆదెమ్మ శశికళ కోశాధికారిగా మంజునాథరెడ్డిని నియమించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పార్టీ అధ్యక్షుడలు రాణి జనార్దన్ రెడ్డి రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు ఆంజనేయప్ప, లోకేష్ రెడ్డి కమల్ నాథ్ రెడ్డి ఇంకా మిగిలిన నాయకులు సన్మానించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మురళి కేశవ బిజెపి పార్టీలో చేరినారు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అప్పుసామి కార్తీక్ ఆచారి రవి బి నాగరాజు ఇంకా పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.