బాధిత కుటుంబానికిఎల్ఓసి పత్రము అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతల్లపల్లి గ్రామానికి చెందిన కంచె శ్రావ్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం అయిదు లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి చొప్పదండి శాసన సభ్యులు మేడిపెల్లి సత్యం మంజూరు చేయగా, ఆ ఎల్ఓసి పత్రాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్ బాధితురాలు తండ్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరి రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి వినోద్ రెడ్డి, గుర్రం అనిల్ పాల్గొన్నారు.