బాదంపల్లి ప్రధాన రహదారికి. భారీ గండి బ్రిడ్జిను కట్టాలి

★సామాజిక విశ్లేషకుడు ప్రజాపక్షపాతి మామిడి విజయ్ కోరారు.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29. 2026. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామపంచాయతీ నుండి పొనకల్ జన్నారం మండలంకు వచ్చే ప్రధాన రహదారి పాత బ్రిడ్జి గత 45 సంవత్సరముల క్రితం కట్టినది ఎగువన చెరువుల నీరు వాగులు ఒర్రెలు చెలిమెలు మత్తడులా కాలువాల నీరు భారీగా రావడంతో పూర్తిస్థాయిలో శిధిలావస్థలో ఉంది పలుసార్లు అనేక ప్రమాదంలో జరిగిన సందర్భం లు ఉన్నాయని పలువురు యువత పలు గ్రామాల ప్రజలు రైతాంగం వృద్ధులు తెలిపారు వెంటనే ప్రత్యేక బడ్జెట్ను సుమారు ఒక కోటి 50 లక్షల రూపాయలు కేటాయించి మరమ్మత్తులు శాశ్వతంగా చేయాలి అని పలు గ్రామాల ప్రజల ఆవేదన. స్కూల్ విద్యార్థిని విద్యార్థుల బస్సులు ఆటోలు ప్రమాదపు అంచున ప్రయాణిస్తున్న దృశ్యం చిత్రంలో కనిపిస్తుంది ప్రమాదాన్ని అరికట్టాలి అంటే బ్రిడ్జి నిర్మాణాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ వెంటనే సాంక్షన్ చేయవలసిందిగా సామాజిక వేత్తల మనవి. దూర ప్రాంతపు వారు పలుసార్లు ప్రమాదానికి గురై కాళ్లు చేతులు విరగ్గొట్టు కొన్నారు.