సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి, ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి లోని రోజు వేలాది మంది వాహనాలు రాకపోకలు సాగించే బొడ్మట్పల్లి నుండి మెదక్ వెళ్లే దారిలో రోడ్డు పక్కన మామిడి చెట్టు ఎండిపోయి గత వారం రోజుల క్రితం బైకు మీద ఒక వ్యక్తి టేక్మాల్ వైపు వెళుతున్న సమయంలో ఒక కొమ్మ విరిగి రోడ్డుపై పడింది అదృష్టవశాత్తు అతను ఆ చెట్టు దాటే క్రమంలో ముందు కొమ్మ విరిగి పడడం వలన అది గమనించి ప్రయాణికుడు కొద్దిసేపు ఆగి జాగ్రత్తగా వెళ్లడం జరిగింది ఇట్టి విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు గ్రామస్తులు ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ తలారి అవినాష్ కుమార్ దృష్టికి తీసుకురాగా ఈరోజు ఉదయం జెసిబి మరియు కరెంటు డిపార్ట్మెంట్ గ్రామ కార్మికుల సహాయంతో చెట్టును తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది సర్పంచ్ అవినాష్ కుమార్ మరియు పాండ్యా నాయక్ మరియు ఆందోల్ అశోక్ డి ఆర్ గ్రామ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.