సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, జనవరి 29 2026 ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గ్రామ రైతులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు తమ పంట పొలాలను అవుటర్ రింగ్ రోడ్డుకి ఇవ్వబోమని, వెంటనే ఓఆర్ఆర్ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని ధర్నా చేశారు బలవంతంగా భూసేకరణ చేయవద్దని 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కి వినతి పత్రం అందించారు ఓఆర్ఆర్ లో భూములు కోల్పోయిన రైతులు మాట్లాడుతూ తమ పొలాల్లో ఏడాదికి రెండు నుండి మూడు పంటలు పండుతున్నాయని ఔటర్ రింగ్ రోడ్డుకి తమ విలువైన భూములు ఇవ్వమని తెలిపారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కళ్యాణ్ మాట్లాడుతూ ముందుగా 70 మీటర్లు తీసుకుంటామని తెలిపిన అధికారులు నేడు 250 మీటర్ల స్థలం తీసుకుంటున్నామని తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు 60 రోజులు గడువు ఇవ్వాల్సి ఉండగా కేవలం 21 రోజులు మాత్రమే గడువిస్తున్నారని తెలిపారు రైతులు, రైతు సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో గోపి నాయక్, రైతులు బుడ్డి సూర్య ప్రకాష్, వీర ప్రసాద్, సుబ్బారావు, అరుణకుమారి, రామ్మూర్తి, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, హరిరామ్, కోటేశ్వరరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.