పొలం పిలుస్తోంది కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 పెనగలూరు రిపోర్టర్ మధు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం మండలంలోని తిరుమలరాజుపేట మరియు నర్సింగరాజపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని మండల వ్యవసాయ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. ఇక్కడ ముఖ్యంగా రైతులు వరి , జొన్న, మొక్కజొన్న మరియు నువ్వులు పంటలు సాగుచేస్తున్నారు. అలాగే రైతులు పంటలకు యూరియా ఎక్కువగా వాడినట్లయితే పురుగులు తెగుళ్ల బెడద ఎక్కువగా వుంటుంది. అలాగే భూమి కూడా సారవంతం కోల్పోయి నిస్సారం అవుతుంది. అలాగే యూరియా గురించి రైతులు అడగగా ప్రైవేటు డీలర్ లకు ఆయా డిస్ట్రిబ్యూటర్ల నుండి యూరియా ఇవ్వకపోవడం వలన గత ఖరీఫ్ సీజన్ 2025 మరియు ఈ రబీ సీజన్ లో ఇప్పటి వరకు ఒక బస్తా కూడా రైతులకు అమ్మకాలు జరపలేదు. అందు వలన రైతులు పూర్తిగా రైతు సేవా కేంద్రాల మీదనే అదరాడటం వలన రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా నిల్వలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మన మండలం ఎక్కడ ఇబ్బందులు కలగకుండా యూరియా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పుడు కూడా అవసరం వున్న మేరకు ఆయా రైతుసేవ కేంద్రాల నుండి ఇండెంట్ పెట్టడం జరిగింది. అలాగే రైతులు కూడా యూరియా దొరుకుతుందో లేదో అనే అపోహతో ఇళ్లలో నిల్వ పెట్టుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. అలా చేయడం వలన ఇతర రైతులకు ఇబ్బందులు కలిగేలా చేస్తున్నారు. రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా మా జిల్లా అధికారుల సహకారంతో ఎప్పటికప్పుడు ఆయా రైతుసేవ కేంద్రాల పరిధిలో నిల్వలు ఉండేలా చూస్తున్నాను అని మండల వ్యవసాయ అధికారు సుబ్రమణ్యం తెలిపారు.. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారి సిబ్బంది మరియు రైతులు పాల్గొనడం జరిగింది.