పేదల సొంతింటి కలే ఇందిరమ్మ ఇండ్ల పథకం

★బిజ్వరం గ్రామానికి 30 ఇండ్లు మంజూరు: సర్పంచ్ శైలజ శ్రీనివాసరెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ 29 మల్దకల్ మండలం ఎం కృష్ణయ్య. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని బిజ్వారం గ్రామంలో సర్పంచ్ శైలజ శ్రీనివాసరెడ్డి ఆధ్వరంలో బుధవారం పద్మ, వెంకటేష్ రెండవ వార్డ్ లో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను స్థానిక నాయకులు, పంచాయతి కార్యదర్శి బసిరెడ్డి కలిసి ముగ్గు పోసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శైలజ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… సకాలంలో ఇల్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు. గ్రామానికి మొత్తం 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే 30 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశలో కొనసాగుతున్నాయని, మిగతా వాళ్ళు పనులు కూడా శరవేగంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ మాట నిలబెట్టుకుంటోదని వారు పేర్కొన్నారు.