సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29(పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారని సోషల్ మీడియాలో, అలాగే కొన్ని వార్తా మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారం. ఈ తప్పుడు ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోనే బిఆర్ఎస్ పార్టీలో కందాల ఉపేందర్ రెడ్డి కొనసాగుతున్నారు.
అందువల్ల పాలేరు నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఇలాంటి పుకార్లను, ఊహాగానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని మనవి చేస్తున్నాను. మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాం. రాబోయే రోజుల్లో పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవబోయే నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డి అని అన్నారు.