సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 29- సికింద్రాబాద్- పార్సీగుట్టలో మంచినీటి సరఫరా సామర్ధ్యం తక్కువగా ఉన్నదని స్థానికులు కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి జలమండలి అధికారులతో పర్యటించారు మంచినీటి సరఫరా జరుగుతున్న సమయంలో పైపులైన్లు, వాల్వులు, నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి సమస్యకు కారణాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానికులకు తగిన మోతాదులో నీరు అందేలా తక్షణ చర్యలు తీసుకొని సమస్యను శాశ్వతంగా పరిష్కరించా లని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ప్రజల మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని, నీటి సరఫరా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారం చూపుతామని డాక్టర్ సామల హేమ తెలిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు,ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ నవ్య , స్థానికులు తదితరులు పాల్గొన్నారు.