పాపకొల్లు రోడ్డు వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలి

★ఏడు అడుగులు పెంచి రోడ్డు నిర్మించాలని సీపీఐ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో ★ఆర్ అండ్ బి అధికారుల హామీతో ఆందోళన విరమణ

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 29 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ని పాపకొల్లు రహదారి మూడు అడుగులు పెంపు సరిపోదని ఏడు అడుగుల పెంచితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని , ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే పెంచాలని కోరుతూ సిపిఐ జూలూరుపాడు మండల సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు అనంతరం సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ నిత్యం వందలాది వాహనాలు మెయిన్ రోడ్డు కి వస్తున్నాయని రహదారి మూడు అడుగులు వెడల్పు ఉంటే తరచూ ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ప్రధానంగా ఎస్బిఐ, ఏపీజీవీబీ బ్యాంకులు ఇటు ఉండటంవల్ల వాహనదారులు అధిక సంఖ్యలో రావటం జరుగుతుందని , వాహనాలు బయట పార్కింగ్ చేస్తే తరచూ ట్రాఫిక్ సమస్య వల్ల ఆటో కార్మికులు, ఉద్యోగులు , విద్యార్థులు అవస్థలు పడుతున్నప్పటికీ , అండ్ బి అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు వెడల్పు పెంచి ఇబ్బందులు లేకుండా చూడాలని , కోరారు ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులకు ఆర్ అండ్ బి అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని , లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, యాలంకి మధు యాస రోశయ్య, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా కొండా వీరయ్య, గార్ల పాటి వీరభద్రము ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కార్యదర్శి నిమ్మటూరి లచ్చయ్య, గార్లపాటి శివకృష్ణ ఎస్కే బుడెన్ పాషా మోదుగు దానేలు గార్లపాటి కిరణ్ పటేలు కృష్ణ ఇల్లంగి సుందర్రావు కోటి వెంకటేశ్వర్లు రామకృష్ణ సురేష్ తదితరులు పాల్గొన్నారు.