సాక్షి డిజిటల్ న్యూస్ :29 జనవరి 2026 తంబాలపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం పాడి రైతులు పశు బీమా, పెయ్య దూడల సూదులను సద్విని యోగం చేసుకోవాలని మదనపల్లె పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ రసూల్ సాబ్ సూచించారు. బుధవారం ఆయన గుండ్లపల్లి, ఎగువ బోయపల్లెలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పసు ఆరోగ్యశిబిరాలను సందర్శించారు. ఈ శిబిరంలో 187 పశువులకు బ్యూటాక్స్ పిచికారి, 38 పశువులకు గర్భకోశ వ్యాధిచికిత్స, 130 పశువులకు నట్టల నివారణ మందు తాపించారు. ఈ సందర్భంగా డిడి మాట్లాడుతూ రూ 300 చెల్లించి మూడేళ్లు కాలానికి రూ 30వేలు బీమా, గొర్రెలకు రూ 60 లతో రూ 6000 బీమా పొందవచ్చని అవకాశాన్ని సద్విని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి డాక్టర్ సుమిత్ర, మండల డాక్టర్ విక్రమ్ రెడ్డి, అంబులెన్స్ డాక్టర్ ఇందు, సహాయకులు భాస్కర్ రెడ్డి, సాదిక్ భాషా, కిరణ్, ప్రవీణ్, రమేష్ పాడిరైతులు పాల్గొన్నారు.