సాక్షి డిజిటల్ న్యూస్, 29 జనవరి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాజీ సర్పంచ్ కంకణాల నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కంకణాల రంజిత్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్ష యాభై వేల రూపాయల వ్యయంతో పాఠశాల వేదిక నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు సక్రమంగా నిర్వహించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ సుధారాణి, ఉపాధ్యాయులు రఘురామారెడ్డి, మేడి మధు, కాన్సిరాం వెంకట్రాంరెడ్డి, జయశ్రీ, లలిత నాయకులు ఒకటో వార్డ్ మెంబర్ దండిగా పాండు,మాజీ ఉపసర్పంచ్ బెల్లి నరసింహ, దండిగా నాగరాజు, విజయ్,ఆరోరి లక్ష్మయ్య,దండిగా లక్ష్మయ్య, దండిగా ఉపేందర్, బెల్లి ఆది తదితరులు పాల్గొన్నారు.
