పత్రికా ప్రకటన: జనవరి 27.

*రాంకీ ఫౌండేషన్ వారి ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలి. *విశాఖ ఫార్మసిటీ ఎండి డా"పిపి లాల్ కృష్ణ.

సాక్షి డిజిటల్ న్యూస్ పరవాడ : జనవరి 29: రాంకీ ఫౌండేషన్ వారు సామాజిక బాధ్యతలో భాగంగా పేద ,నిరుపేద ,మధ్యతరగతి విద్యార్థులకు అందిస్తున్న ఉప కార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ ఫార్మసిటీ ఎండి డాక్టర్ పిపి లాల్ కృష్ణ కోరారు. మంగళవారం రాంకీ కమర్షియల్ హబ్ ఆవరణ ఏర్పాటుచేసిన రాంకీ ఫౌండేషన్ ఉపకార వేతనాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో విద్య ఉపాధి ఉద్యోగ రంగాల్లో విప్లవత్మకమైన మార్పులు రానున్నాయని వాటికి తగ్గట్టు విద్యార్థులు నైపుణ్యాన్ని సమకూర్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు. పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రాంకీ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం ఉపకార వేతనాలు మంజూరు చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం 140 మంది విద్యార్థులకు రూ “12,33,500 ఉపకార వేతనం చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రి సస్టైనబులిటీ ప్రతినిధి సాంబశివరావు, రాంకీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డాక్టర్ శ్రీకాంత్, విశాఖ ఫార్మాసిటీ డీజీఎం గిరిధర్ రావు భక్షి ,రాంకీ ఫౌండేషన్ సిబ్బంది రాజేశ్వరీ, శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *