నేటి నుంచి 5 రోజులు ఉమా మహేశ్వరి దేవి తీర్థ మహోత్సవం

సాక్షి డిజిటల్ న్యూస్ 29 జనవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, నేడు మొదలుకొని సోమవారం వరకు శ్రీ ఉమా మహేశ్వరి దేవి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఉమా మహేశ్వరి దేవి అమ్మవారికి ఐదు రోజులపాటు కుంకుమ పూజలు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించ బడతాయని అన్నారు ఆదివారం మధ్యాహ్నం గుర్రపు స్వారీ పోటీలు అదే రోజు రాత్రి స్థానిక రామాలయం మరియు ఉమా దేవి ప్రాంగణం వద్ద డాన్స్ బేబీ డాన్స్ నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా సోమవారం తీర్థం ఆఖరి రోజు కావడంతో మధ్యాహ్నం ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు రాత్రికి మాజీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు ఇంటి సమీపంలో అదేవిధంగా ఆర్టిసి కాంప్లెక్స్ గొల్ల వీధి లోడాన్స్ బేబీ డాన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఎడ్ల పరుగు ప్రదర్శన గుర్రపు స్వారీ పోటీల్లో గెలు పొందిన విజేతలకు భారీ నజరానా అందజేయడం జరుగుతుందని తెలిపారు మండలంలోని ప్రజలందరూ తీర్థ మహోత్సవాన్ని తిలకించి జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.